ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన చిత్రం గులేబకావళి. రేవతి ప్రధాన పాత్ర పోషించారు. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదలచేశారు. బిగ్ సీడీని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారధి, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ విడుదలచేయగా, ఆడియో సీడీలను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ ఆవిష్కరించారు. తొలి సీడీని జీవిత రాజశేఖర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ, చక్కటి వినోదంతో పాటు మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్ అంశాలు మిళితమైన చిత్రమిది. నిధి అన్వేషణ నేపథ్య కథాంశాలతో దక్షిణాదిలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి.
ఈ సినిమా ఆ జాబితాలో నిలవాలి. చిన్న నిర్మాతల సినిమాల్ని విడుదలచేసి, వారికి సాయపడాలనే తపన మల్కాపురం శివకుమార్‌లో కనిపిస్తుంది. ఆయనే చేసే ప్రతి సినిమా విజయవంతం కావాలి అని అన్నారు. తెలుగు, తమిళ నేటివిటికీ సరిపోయే కథ ఇదని, అందరికీ నచ్చేవిధంగా ఉంటుందని దర్శకుడు కల్యాణ్ చెప్పారు. చిత్ర నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ, చెన్నైలో ఐదోవారంలో ఈ సినిమాను చూశాను. తమిళ భాష రాకపోయినా సాధారణ ప్రేక్షకుడిగా సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఏప్రిల్ 6న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చెప్పారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, అన్నం ఉడికిందా..లేదా చూడాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. పాటలు, ట్రైలర్‌ను బట్టి ఈ సినిమా విజయం తెలిసిపోతోంది. నాకు ఏం మిగులుతుందనే ఆలోచనను పక్కనపెట్టి ఎదుటివారిలో ఆనందాన్ని చూసి సంతోషపడే వ్యక్తి మల్కాపురం శివకుమార్. నేను ఓ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమాకు శివకుమారే పంపిణీదారుడిగా వ్యవహరించనున్నారు. ప్రయోగాత్మకంగా ఆ చిత్రం తెరకెక్కనుంది అని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న జీవిత రాజశేఖర్, శ్రీనివాస్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, రచ్చరవి, జబర్ధస్త్ రాము, కొరియోగ్రాఫర్ జానీ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa