సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'మహానటి' షూటింగ్ పూర్తైంది. ఈ నేపథ్యంలో 'మహానటి' టీం సావిత్రికి ఘన నివాళులు అర్పించారు. వారిలో కీర్తి సురేశ్, మోహన్ బాబు, నాగ్ అశ్విన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా 'మహానటి'లో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేశ్ భావోద్వేగానికి గురైంది. మహానటి టీంతో ప్రయాణం మరిచిపోలేనిదని ఆమె తెలిపింది.
ఇక నటుడు మోహన్ బాబు చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లను ఈ సందర్భంగా సత్కరించారు. అశ్వనీదత్ అడుగుజాడల్లో నడుస్తున్న ప్రియాంక దత్, స్వప్న దత్ ఇద్దరు ఆయన లాగే విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa