ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కొండ పొలం' సినిమా నుంచి వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 20, 2021, 11:30 AM

'ఉప్పెన'తో హీరోగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నటుడు వైష్ణవ్‌ తేజ్‌. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కెరీర్‌ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం, ఆయన కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'కొండపొలం' అనే టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.


అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు తెలియజేస్తూ వచ్చిన ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు క్రిష్‌ ఓ సందర్భంలో తెలిపారు. వైష్ణవ్ తేజ్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 8న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకూ పూర్తయ్యింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa