ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ మళ్లీ పోస్ట్ పోన్‌..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 20, 2021, 11:56 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది.


ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ విడుదల మళ్లీ పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో థియేటర్స్‌ రీ ఓపెన్ కాలేదు.


ఆ కారణంగానే 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ విడుదలను వాయిదా వేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని టాక్‌. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామారాజుగా కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa