అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా , పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటే తమిళంలో తెరకెక్కుతున్న 'సాని కాయిదమ్' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. 1980 ల కాలం నేపథ్యంలో జరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు మహేశ్వర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిన్న అనగా (ఆగస్టు 19 వ తేదీ) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ ఓ పల్లెటూరి అమ్మాయి గా డి గ్లామర్ గా కనిపించగా , ఆమె పక్కనే కూర్చున్న దర్శకుడు సెల్వరాఘవన్ లుక్ మరింత డిఫరెంట్ గా ఉంది. ఇందులో సెల్వరాఘవన్ చేతికి రక్తం ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 'సాయి కానిదమ్' సినిమా ఓ అద్భుతమైన జర్నీ అని, ఈ సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను అని, ఈ సినిమా మిమ్మల్ని ఎంతగానో ఆనంద పెడుతుంది అని సెల్వరాఘవన్ తెలిపాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఈ సినిమాను థియేటర్లలో కాకుండా 'ఓటిటి' లో ప్రసారం చేయాలని ఉద్దేశం లో చిత్రబృందం ఉన్నట్లు ఫిల్మీ దునియా లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ , మిస్ ఇండియా సినిమాలు 'ఓటీటీ' లోనే విడుదలయ్యాయి. అలాగే 'సానికాయిధమ్' సినిమా కూడా 'ఓటిటి' లోనే విడుదల అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa