ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణాష్టమి సందర్భంగా 'రాధే శ్యామ్' సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 30, 2021, 11:42 AM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ 'రాధే శ్యామ్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్‌తో చిత్ర బృందం సర్‌ప్రైజ్ చేసింది. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ  దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అయితే లాక్ డౌన్ రావడం, షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జులై 30కి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే జులై 30న కొత్త పోస్టర్ వదులుతూ.. 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు కొత్త డేట్ అనౌన్స్ చేశారు. కాగా నేడు (ఆగస్ట్ 30) కృష్ణాష్టమి సందర్భంగా, చిత్రబృందం ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో విక్రమాదిత్య - ప్రేరణలుగా నటిస్తున్న ప్రభాస్ - పూజా హెగ్డేల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రెబల్ స్టార్ కృష్ణం రాజు - టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో యూవి క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్-ప్రశీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa