మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - శంకర్‌ల పాన్ ఇండియన్ సినిమా నేడు (సెప్టెంబర్ 8) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ కెరీర్‌లో 15, దిల్ రాజు నిర్మాణ సంస్థకి 50వ చిత్రంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అడ్వాణీ, ఇతర ముఖ్య పాత్రల్లో అంజలి, రవిబాబు, సునీల్, జయరామ్ నటించబోతున్నారు. శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa