శర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధాన పాత్రధారులుగా 'మహా సముద్రం' సినిమా రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో కథానాయికలుగా అదితీ రావు, అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ తరువాత మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమాను గురించి అజయ్ భూపతి మాట్లాడాడు. ఈ సినిమా షూటింగు ఎక్కువ భాగం వైజాగ్ లో చిత్రీకరించాము. అత్యధిక రోజులు వైజాగ్ లో షూటింగును జరుపుకున్న సినిమా ఇదే. 'ఆర్ ఎక్స్ 100'ను మించిన ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా చూశాక .. నేను చెప్పింది నిజమేనని ఒప్పుకుంటారు.
జగపతిబాబుగారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ తరహా పాత్రను ఆయన ఇంతవరకూ చేయలేదని నేను బలంగా చెప్పగలను. తప్పకుండా ఇది ఆయన కెరియర్లో గుర్తుపెట్టుకోదగిన పాత్ర అవుతుంది. ఈ సినిమాలో అనవసరమైన పాత్రగానీ .. అనవసరమైన సన్నివేశం గాని కనిపించదు" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa