యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన సినిమా 'వరుడు కావలెను'. తాజాగా ఈ మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. లేడీ డైరెక్టర్ లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించించారు. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీపై ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ మంచి అంచనాలను పెంచాయి. ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తోనూ 'వరుడు కావలెను' సినిమాకి బాగా హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో మరితంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ తాజాగా "వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు .. వయ్యారం చిమ్మేసే అందాల బొమ్మలు' అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మంచి విజువల్ ట్రీట్‌గా అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో సరైన హిట్‌లేని నాగ శౌర్యకు ఖచ్చితంగా 'వరుడు కావలెను' సినిమాతో మంచ్ హిట్ దక్కుతుందనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa