దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అండ్ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ “ఖిలాడి” కూడా ఒకటి. రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో సాలిడ్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పుడు షూట్ ఫైనల్ టచ్ లో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు ఓ బిగ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ ఇంట్రెస్టింగ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా డింపుల్ హయాతి మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa