రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'ఆర్ఆర్ఆర్' కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్ర యూనిట్ కూడా చిత్రం నుంచి మంచి అప్ డేట్స్ ఇస్తోంది. ఇటీవల విడుదలైన సెకండ్ సాంగ్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అదిరే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. పక్కా ప్లాన్ తో రానున్న రోజుల్లో కీలక అప్ డేట్స్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాల నిడివి 2 గంటల 50 నిమిషాలకు తక్కువ కాదు. అలాగే సినిమా నిడివి దాదాపు మూడు గంటలు. ఎలా చూసినా 3 గంటల్లో సినిమా రావడం ఖాయం. విజువల్ గా మూడు గంటల పాటు రాజమౌళి ఏ రేంజ్ లో ట్రీట్ లు అందిస్తున్నాడో తెలియాలంటే జనవరి 7 వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa