ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్పూర్తి చేసుకున్ “మరక్కార్”..!

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 11:45 AM

ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించిన చిత్రం “మరక్కార్”. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే మోహన్ లాల్‌కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ సినిమా మీద మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa