హీరో అర్జున్ సర్జా పై నటి శృతి హరిహరన్ మోపిన లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల నుండి అర్జున్ సర్జా క్లియర్ చిట్ ఇచ్చారు పోలీసులు. ఈ మేరకు మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టుకు కర్ణాటక పోలీసులు ‘బి-రిపోర్ట్’ సమర్పించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.నటి శృతి హరిహరన్ `మీ టూ క్యాంపెయిన్`లో భాగంగా తన సోషల్ మీడియాలో అర్జున్ సర్జాకు వ్యతిరేకంగా నాలుగు పేజీల ప్రకటన చేశారు . మీ టూ ఉద్యమానికి మద్దతుగా ఈ సంఘటన తనను ఎలా ప్రభావితం చేసిందో వెల్లడించింది. ఈ కేసును బెంగళూరులోని కబ్బన్‌పార్క్ పోలీసులు మూడేళ్ల క్రితం విచారణకు స్వీకరించారు.చట్టపరమైన చర్యలు మరియు విచారణ తర్వాత, సాక్ష్యాలు లేకపోవడంతో, అర్జున్ సర్జాపై ఉన్న అన్ని అభియోగాల నుండి క్లియర్ అయినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa