శ్రీ కార్తీక్ దర్శకత్వం లో శర్వానంద్ హీరోగా రీతూ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌పై చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. డిసెంబర్ 29 సాయంత్రం 5 గంటలకు సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా ప్రకటించింది. అమల అక్కినేని కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జాక్వెస్ బెజోయ్ సంగీతం అందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa