విజయ్ దేవరకొండ , పూరి జగన్నాధ్ కలిసి చేస్తున్న చిత్రం "లైగర్". ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దడం , అందులో మైక్ టైసన్ నటించడం అనే వార్తలు మనకు తెలిసిందే. ఐతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పూరి కి , ఇటు విజయ్ కి ఇద్దరికి ఈ సినిమా కీలకం అనే చెప్పాలి. అందుకేనేమో ఈ సినిమా పట్ల చాల జాగర్తలు తీసుకుంటుంన్నారంట విజయ్ దేవరకొండ. షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతున్న సంగతి వాస్తవం ఐనప్పటికీ, చిత్ర బృందం మాత్రం ఈ సినిమాకి సంభవించిన ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా, విజయ్ దేవరకొండ రెండు ఫోటోలను పెట్టి షూటింగ్ కి , షూటింగ్ తర్వాత అని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చెయ్యడం జరిగింది. ఈ ఫోటోలను చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఈ రౌడీ బాయ్ ఎంతగా కష్టపడుతున్నాడో అన్నది. మరి వీళ్ళ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa