రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ల చరిత్రను వక్రీకరించారంటూ పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, విడుదలపై స్టే విధించాలని కోరారు. పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తెలిపింది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. ఆలియాభట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలకావాల్సి ఉండగా కరోనా కేసుల పెరుగుదల కారణంగా వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa