ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ డేట్ సమీపించే కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం క్రమం తప్పకుండా అప్ డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ లో ఉద్వేగం పెంచుతోంది.
ఇటీవల 'ఎత్తర జెండా' అనే ఉత్తేజభరిత గీతం గురించి వెల్లడించిన చిత్రబృందం ఆ పాట తాలూకు ప్రోమో వీడియోను నేడు పంచుకుంది. పూర్తి పాట ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పాటకు కీరవాణి బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa