ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 11:25 AM

MSరాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం.అనల్అరసు మాస్టర్ భారీ ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించారు.
ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ కూడా కంప్లీట్ అయ్యింది అని లేటెస్ట్ టాక్.నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa