సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మురికివాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్స్ సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరో నాలుగు రోజులలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, కర్ణాటకలో మాత్రం కాలా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. కావేరి జలాల విషయంలో రజనీకాంత్ పూర్తిగా తమిళులకి మద్దతు ఇవ్వడంతో ఆయన సినిమాలని కర్ణాటకలో విడుదల కానివ్వమంటూ పట్టుబట్టుకు కూర్చున్నారు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి. ఇప్పుడు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా కాలా సినిమా కర్ణాటకలో విడుదల కావడం అసంభవం అంటూ కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి ఉద్ఘాటించారు. అయితే కాలా రిలీజ్ విషయంపై ముఖ్యమంత్రి కుమారస్వామి చలన చిత్ర మండలితో చర్చలు జరిపి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు. ఇక మీదట రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలు కర్ణాటకలో అస్సలు ఆడనివ్వం. వీరిద్దరి సినిమాలు తప్ప వేరే ఏ తమిళ సినిమా అయిన కర్ణాటలో విడుదలయ్యేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కర్నాటక ఫిలిం చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa