ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టాండ్ అప్ రాహుల్” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 12:09 PM

సాంటో  మోహన్ వీరన్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం "స్టాండ్ అప్ రాహుల్". ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
మార్చి 18న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈరోజు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa