ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కెరీర్ పరంగా చరణ్కిది 15వ సినిమా. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో చిత్రీకరించారు.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు లీకవడంతో ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపిస్తారని అర్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తండ్రి పాత్రకి శ్రీకాంత్ స్నేహితుడిగా నటించనున్నారట.
ఫ్లాష్ బ్యాక్ లో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చరణ్, శ్రీకాంత్ కలిసి ఒక రాజకీయ పార్టీని స్థాపించగా, కుయుక్తి కలిగిన శ్రీకాంత్ చరణ్ పాత్రని చంపేయిస్తాడట. దీంతో శ్రీకాంత్ పై తీరని పగతో రగిలిపోతుంటాడు కొడుకు పాత్ర రామ్ చరణ్. కథ పాతగానే ఉన్నా శంకర్ తనదైన శైలిలో ఈ సినిమాకు కమర్షియల్,రాజకీయ హంగులను జోడించి ప్రేక్షకుల ముందుకు కొత్తగా తీసుకురానున్నారు.
ఈ సినిమాలో అంజలి, సునీల్,ఎస్ జె సూర్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa