రవితేజతో రొమాన్స్ యంగ్ హీరోయిన్ నివేథా పేతురాజ్ మెగా ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. చిరంజీవి-బాబి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా అవకాశం వుంది. ఆ అవకాశం నివేథా పేతురాజ్ కు దక్కింది. ఈ సినిమాలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజకు జోడీగా నివేథాని తీసుకున్నారు. ఈ సినిమా కోసం బాబీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కథని సిద్ధం చేశాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa