కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో శనివారం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వేదికపై మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గొప్ప దర్శకుడి కల అని అన్నారు. రాబోయే తరాలకు ఈ సినిమా నిదర్శనం కాబోతోందని చెప్పారు. అటువంటి ఆ సినిమాలో తనకు కూడా ఒక భాగం కల్పించినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని ఎన్టీఆర్ అన్నారు. రామ్ చరణ్ తో తన ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుతున్నానని ఎన్టీఆర్ చెప్పారు. రామ్ చరణ్ ఎప్పుడూ తన పక్కనే ఉండాలని తారక్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa