నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్,పూజాహెడ్గే నటిస్తున 'బీస్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు."అరబిక్ కుతు" అనే టైటిల్ తో "బీస్ట్"మూవీ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయగా,తక్కువ టైం లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.'జాలీ ఓ జింఖానా' అనే టైటిల్ తో రిలీజ్ అయినా ఈ సాంగ్ ని అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేయగా,ఈ హిట్ ట్రాక్ ని విజయ్ పాడారు.తాజాగా విడుదలైన,ఈ పాట ఇన్‌స్టంట్ హిట్‌గా మారింది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,17గంటల్లో ఈ సాంగ్ 11.5మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించి 1.4 మిలియన్ లైక్‌లను పొందింది.సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14,2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ అవుతుంది అని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa