ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారక్ తో గొడవా- అంతా ఉత్తుత్తే

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 09, 2018, 01:10 PM

నిన్నటి నుంచి సోషల్ మీడియాతో పాటు కొన్ని పేరున్న వెబ్ సైట్స్ హీరో జూనియర్ ఎన్టీఆర్-కమెడియన్ శ్రీనివాసరెడ్డి మధ్య అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ లో ఏవో మనస్పర్థలు వచ్చాయని అందుకే తారక్ శీనుతో ఆంటీఅంటనట్టు ఉంటున్నాడని రకరకాలుగా ప్రచారం చేసాయి. దీంతో ఇది నిజమేనని అభిమానులు నమ్మే పరిస్థితి. ఇది కాస్త విపరీతంగా వైరల్ కావడంతో విషయం యూనిట్ దాకా వెళ్ళింది. ఇలాంటి నెగటివ్ ప్రచారాలు ఎంత చేటు చేస్తాయో తెలిసిన త్రివిక్రం వెంటనే అలెర్ట్ అయిపోయి ఇద్దరిని కలిపి తాను కూడా ఉన్న సెల్ఫీని బయటికి వదిలాడు. ఇది చూసాక కానీ ఫ్యాన్స్ మనసు కుదుటపడలేదు. ఇది ఎవరు ప్రచారంలోకి తెచ్చారో కానీ తారక్ సినిమా వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్న నేపథ్యంలో వీరరాఘవ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ క్షణాల్లో పాకిపోతోంది. 


శ్రీనివాసరెడ్డితో ఈగో సమస్యకు వెళ్లేంత సిల్లీ పని జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో చేయడని తెలిసినా కూడా ఇదిలా ప్రచారం కావడం ఆశ్చర్యమే. కాకపోతే ఏదో ఒక న్యూస్ ఫీడ్ తో పబ్బం గడిపే కొన్ని సోషల్ మీడియా వర్గం ఇదొక హాట్ టాపిక్ గా మార్చిందే తప్ప ఇందులో మ్యాటర్ ఏమి లేదు. అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. దసరాను టార్గెట్ చేసుకుని మరీ పనులు కానిచ్చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చాలా ఏళ్ళ తర్వాత యంగ్ టైగర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ స్పందన దక్కించుకోగా టీజర్ ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపే శ్రీనివాసరెడ్డి టాపిక్ వార్తల్లోకి రావడంతో సినిమా అప్ డేట్ కాస్త ఈరకంగా దారి మళ్లింది. మొత్తానికి ఒక్క సెల్ఫీతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేసాడు త్రివిక్రమ్. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక రిలాక్స్ కావొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa