క్వాంటికో, బేవాచ్ లతో అంతర్జాతీయ స్టార్ గా ఎదిగిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 35 ఏళ్ల ప్రియాంకా 25 ఏళ్ల నిక్ తో కలసి ఇటీవలి కాలంలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. తాజాగా వీరిద్దరూ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు వీరిద్దరూ కలిసి ఓ సినిమా ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.
Nick Jonas and Priyanka Chopra spotted at JFK International Airport in New York City, NY - June 8th pic.twitter.com/7EjoLNBZRR
— Nick Jonas News (@JickNonasNews) June 8, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa