ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫస్ట్ లుక్ : బాలయ్య బాబు కి జన్మదిన శుభాకాంక్షలు

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 10, 2018, 02:57 PM

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ `యన్ టీఆర్`ను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు బాలయ్య బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని నందమూరి అభిమానులకు `యన్ టీఆర్` చిత్ర యూనిట్ అద్భుతమైన బహుమతినిచ్చింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా `యన్ టీఆర్` ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తండ్రీ కొడుకులిద్దరూ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలోని పాత్రలతో డిజైన్ చేశారు. అంతేకాకుండా ఆ ఫస్ట్ లుక్ లో బాలయ్య బాబుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం విశేషం. సోషల్ మీడియాలో విడుదలైన ఫస్ట్ లుక్ వైరల్ అయింది.

తాజాగా విడుదలైన `యన్ టీఆర్` చిత్ర ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ - బాలకృష్ణ నటించిన పలు హిట్ చిత్రాల్లోని క్యారెక్టర్స్ ను ఆ ఫస్ట్ లుక్ లో డిజైన్ చేశారు. బాలకృష్ణకు ఎన్టీఆర్ మీసాలు దిద్దుతున్నట్లు ఆ ఫస్ట్ లుక్ కే హైలైట్. ‘తన నూరవ చిత్రంలో అమ్మపేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు - శతాధిక చిత్ర ‘నటసింహం’ - నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు..’ అంటూ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.  వారాహి చలన చిత్రం - బాలకృష్ణ సంయుక్తంగా ఈ మెగా ప్రాజెక్టు ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa