హీరో రామ్ చరణ్ కు హీరోయిన్ సమంత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఓవైపు ఆర్ఆర్ఆర్ ఘనవిజయం, మరోవైపు పుట్టినరోజు.... ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చరణ్ పుట్టినరోజుపై అందాలతార సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. నా ఫేవరెట్ రామ్ చరణ్ కు వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ తెలిపింది . ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి, అందులో రామ్ చరణ్ మతిపోయేలా నటించిన వైనం గురించి వినడం ఎంతో అద్భుతంగా ఉందని సమంత పేర్కొంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడుతున్నానని వెల్లడించింది. ఈ అభినందనలకు నువ్వు ఎంతో అర్హుడివి అంటూ చరణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ ఏడాది నీకు సూపర్ హ్యాపీగా గడచిపోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సామ్ తన పోస్టులో తెలిపింది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa