‘తొండన్’ చిత్రంతో పరిచయమై ఇటీవల విడుదలైన ‘సెమ’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ఆర్తన. ప్రస్తుతం ‘కడైకుట్టి సింగం’లో ముగ్గురు కథానాయికల్లో ఒకరుగా నటిస్తోంది. ఇది కాకుండా మరో మూడు సినిమాల్లో నటిస్తున్నారు ఆర్తన. ఈ సందర్భంగా తన చిత్ర విశేషాల గురించి ఆమె మాట్లాడుతూ చిన్న వయసు నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. నటనపై ఆసక్తి ఎక్కువ. మాది తిరువనంతపురం. చదివిందంతా అక్కడే. పాఠశాలలో జరిగే డ్రామా, సాంస్కృతిక పోటీల్లో తప్పకుండా పాల్గొంటా. ఆ తర్వాత బుల్లితెర యాంకర్‌గా మారా. విజువల్ కమ్యూనికేషన్ పూర్తిచేసిన తర్వాత మలయాళంలో సురేష్‌గోపి చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అనంతరం సముద్రకని ద్వారా ‘తొండన్’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టా. ‘సెమ’ చిత్రం నాకు మంచి గుర్తింపు నిచ్చింది. నాది చాలా సైలెంట్‌గా ఉండే మనస్తత్వం. అహంకారం లేదు. గొడవలన్నా ఇష్టం లేదు. ‘కడైకుట్టి సింగం’ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటించా. ఎవరి బయోగ్రఫీ చిత్రంలోనైనా నటించాలన్నదే నా కోరిక. అలాగే చారిత్రాత్మక కథా చిత్రంలోనూ నటించాలనుంది. త్వరలో నా కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతున్నా. నేను నటించిన ‘వెన్నిలా కబడీ కుళు 2’, ‘కడైకుట్టి సింగం’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు కూడా వెల్లడిస్తానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa