రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అలియా భట్,అజయ్ దేవగన్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.తాజా అప్డేట్ ప్రకారం,శ్రద్ధా కపూర్,పరిణీతి చోప్రా,బ్రిటిష్ యాక్ట్రెస్ అమీ జాక్సన్ అండ్ డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ మూవీలో ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రద్ధా కపూర్:-టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'సాహో' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.'RRR'లో ఆమెకు ముఖ్యమైన పాత్ర ఆఫర్ చేయబడింది,కానీ ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఆఫర్‌ను తిరస్కరించింది.
పరిణీతి చోప్రా:-'కేసరి' సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా,'RRR'లో నటిస్తున్నారా అని ఆమెను అడిగినప్పుడు,'నా సినిమాలు ఏవైనా ఈ వారంలోనే ప్రకటిస్తాం' అని చెప్పింది.
అమీ జాక్సన్:-I అండ్ 2.0లో నటించిన ఈ బ్రిటీష్ యాక్ట్రెస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ 'RRR'లో ఒక ముఖ్యమైన పాత్రను ఆఫర్ చేసారు,కానీ ఆమె గర్భం దాల్చడం వల్ల ఆఫర్‌ను తిరస్కరించింది.
డైసీ ఎడ్గార్ జోన్స్:-బ్రిటిష్ యాక్ట్రెస్ డైసీ ఎడ్గార్ జోన్స్ కి 'RRR' సినిమాలో లీడ్ రోల్ ని ఆఫర్ చేయగా రిజెక్ట్ చేసింది.ఆ తర్వాత ఒలివియా మోరిస్‌ను బోర్డులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa