విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో సమంత, నయనతార అండ్ విజయ్ సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కాతువాకుల రెండు కాదల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లుగా అలాగే మూవీ టీమ్ ప్యాక్అప్ తర్వాత కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సామ్ 'యశోద' షూటింగ్‌లో బిజీగా ఉండగా, అంతేకాకుండా ఆమె నటించిన 'శకుంతలం' సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa