ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్య దేవ్ తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 03:26 PM

'స్కైలాబ్‌' లో చివరిగా కనిపించిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులని అలరించడానికి రాబోతున్నాడు. శరణ్ కొప్పిశెట్టితో తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమాకి 'ఫుల్ బాటిల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ ఎంటర్‌టైనర్‌లో సత్య దేవ్ ఆటో డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. SD కంపెనీ అండ్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa