టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పక్కా కమర్షియల్' సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా రొమాన్స్ చేయనుంది. తాజాగా ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడితో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు హరితో గోపీచంద్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడని టాక్. పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీస్ తీయడంలో డైరెక్టర్ హరికి మంచి గుర్తింపు ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందో లేదో వేచి చుడాలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa