ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన సూర్యకుమార్ యాదవ్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 01:30 PM

2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశ ప్రజలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. విజయానికి అండగా నిలిచిన కోట్లాది మంది మద్దతుదారులకు అంకితమిస్తున్నట్టు భావోద్వేగంతో ప్రకటించాడు.అభిమానుల ప్రార్థనలు, ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అన్నాడు. అయన మాట్లాడుతూ....  "ప్రియమైన టీమిండియా అభిమానులారా, ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ మద్దతు, ఆశీస్సుల వల్లే మేం ఉన్నాం. ఈ ప్రపంచకప్ ట్రోఫీ యావత్ భారతదేశానిది" అని ఆయన పేర్కొన్నాడు. ఈ విజయం కేవలం జట్టుది మాత్రమే కాదని, దేశంలోని క్రికెట్ ప్రేమికులందరి కల అని ఆయన అభివర్ణించాడు."మేం గెలిచినప్పుడు, అది మా విజయం మాత్రమే కాదు. బ్యాట్, బంతితో పెరిగి దేశం కోసం ఆడాలని కలలు కనే ప్రతీ చిన్నారి కల అది. స్టేడియాలను నింపేసి, వాటిని సొంత ఇంటిలా మార్చేసే అభిమానులది. ఇళ్లలో ఉండి మమ్మల్ని ఆదరించే కోట్లాది మందిది" అని సూర్యకుమార్ వివరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa