నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అమెరికా డాలర్ బలపడటంతో పసిడిపై ఒత్తిడి పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం పతనం పరిమితంగానే ఉంది.ఇవాళ ఉదయం 11:10 గంటల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ. 1,60,046 వద్ద ట్రేడ్ అయింది. అలాగే మే సిల్వర్ ఫ్యూచర్స్ 0.19 శాతం నష్టపోయి కిలోకు రూ. 2,67,448కి చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa