నటి జాన్వీకపూర్ ధఢక్ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమె తల్లి శ్రీదేవి హఠాన్మరణం చెందారు. దాంతో జాన్వీ తల్లి మరణాన్ని తట్టుకోగలిగి సినిమా ప్రచార కార్యక్రమాలలో పాల్గొగలదా అనే సందేహం అందరిలో మొదలయింది. కానీ జాన్వీ అన్ని కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంది. తల్లి లేరన్న బాధ నుంచి ఎలా తేరుకున్నారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జాన్వి ఇలా సమాధానం ఇచ్చారు. అది అంత సులువైనది కాదు. నా పని, కుటుంబం నాలో ధైర్యాన్ని నింపాయి. ఒకవేళ చిత్రీకరణలో పాల్గొనలేకపోయినా, నటించలేకపోయినా పరిస్థితి ఇంకా దారుణంగా మారేది. చెప్పాలంటే అమ్మలేదన్న బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది ‘ధఢక్’ సినిమానే. ఈ సినిమా నాకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నన్ను ఎన్నో విధాలుగా కాపాడిందని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa