ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రామారావు ఆన్ డ్యూటీ' రెఢీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 03:50 AM

రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రామారావు ఆన్ డ్యూటీ' సిద్ధమవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్  - రజీషా విజయన్ అందాల సందడి చేయనున్నారు. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని అందించాడు. ఫస్టు సింగిల్ గా 'బుల్ బుల్ తారంగ్' అనే పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించగా, శోభి మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు.


రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాకి, ఆయన కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చాలా కాలం తరువాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందన్నది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa