విశ్వక్ సేన్, రుక్షర్ థిల్లాన్ జంటగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. విద్యాసాగర్ చింత డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా మే 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ గా ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
'నాకిప్పుడు 33, ఇంకో 3 సంవత్సరాలకు 36 వస్తాయి. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా? అది క్రైమా? జైల్లో వేస్తారా?' అని హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. జై క్రిష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa