గుణశేఖర్ దర్శకత్వంలో సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత 'శకుంతలం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ పిరియాడిక్ మైథలాజికల్ లవ్ డ్రామా షూటింగ్ ని కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు సమంత బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె నటన అద్భుతంగా ఉంటుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఆమె నటించిన తమిళ సినిమా 'కాతువాకుల రెండు కాదల్' షూటింగ్ పూర్తి చేసుకుని 28న ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa