సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్ లో సమంత రూత్ ప్రభు ఒక్కరు అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఈ గ్లామర్ బ్యూటీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. తాజాగా ఇప్పుడు శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రానికి కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈరోజు ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కు సామ్ హాజరు కాలేదు. సమంత థాయ్‌లాండ్‌లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది అని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ ఈ మూవీ సెట్స్ పైకి రానుంది అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa