శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భళ తందానా". ఈ చిత్రంలో కేథరిన్ థెరిసా కథానాయికగా నటిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్య, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణ మురళి, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa