ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి 'ఆచార్య' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 12:38 PM

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజాహెడ్గే జంటగా నటించనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం ఒక వారం పాటు టిక్కెట్ ధరలను పెంచడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. అంతేకాకుండా నైజాంలో ఒక వారం పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ జీవోని విడుదల చేసారు. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa