బుల్లితెర వ్యాఖ్యాత సుమ కనకాల లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. ముందుగా ఏప్రిల్ 22న ఈ సినిమాని విడుదల చేయటానికి ముహూర్తం ఖరారు చేసారు నిర్మాతలు. అయితే కేజీఎఫ్ 2, బీస్ట్, ఆచార్య వంటి పెద్ద సినిమాలు ఏప్రిల్ లో ఉండటంతో ఈ సినిమా మే 6 కు వాయిదా పడింది. ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఈ మూవీ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్రబృందం. ఈ మేరకు బుల్లితెర సూపర్ హిట్ టాక్ షో ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో సుమ కనకాల, దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు గెస్ట్ గా వచ్చి జయమ్మ పంచాయితీ ముచ్చట్లతో పాటు కొన్ని పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు. ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. డైరెక్టర్ మాట్లాడుతూ... ముందుగా ఈ సినిమాను సుమ గారి కోసం రాయలేదు. ప్రముఖ నటి రమ్యకృష్ణ గారిని ఊహించుకుంటూ రాసిన కధ ఇది.... అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పక్కనే ఉన్న సుమ ఖచ్చితంగా ఈ కధ చేసి చూపిస్తా అంటూ డైరెక్టర్ కి సవాలు విసురుతుంది.అయితే టాప్ హీరోయిన్ కోసం రాసిన కధని సుమతో ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? సుమకు బదులుగా ఇంకెవరినైనా తీసుకోవచ్చుగా,సుమే ఎందుకు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఆదివారం మధ్యాహ్నం వరకు వేచిచూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa