సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ సినిమాలని తీశారు. టైటానిక్, అవతార్ లాంటి సినిమాలతో సినిమా ప్రేమికులని అండ్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. చాలా కాలంగా ఈ డైరెక్టర్ అవతార్ సీక్వెల్ కోసం పని చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. తాజా అప్డేట్ ప్రకారం, డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా 3D, 4DX, IMAX, డాల్బీ విజన్, PLF వంటి ఫార్మాట్లలో కూడా విడుదల కానుంది. 'అవతార్ 2' మూవీ మొదటి గ్లింప్సె వీడియో లాస్ వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లోని సినిమాకాన్‌లో ప్రదర్శించబడుతుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa