సూపర్ హిట్ రియాలిటీ గేమ్ షో 'సర్కార్' ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని అలరించడానికి ఆహాలో రావడానికి సిద్ధంగా ఉంది. 'సర్కార్' సీజన్ 2 ఆహాలో ఏప్రిల్ 29న సాయంత్రం 6:00 గంటలకు ప్రీమియర్ అవుతుంది మరియు ఆ తర్వాత ప్రతి శుక్రవారం ప్రసారం అవుతుంది అని సమాచారం. ఆహా OTTలో ఈ షో మొదటి సీజన్ స్మాష్ హిట్ గా నిలిచింది. ఈ షో రెండో సీజన్‌కి స్టార్ హోస్ట్ అయిన ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, ప్రణీత్ రెడ్డి, మురళీధర్ మరియు దీపికా పిల్లి సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లో అతిథులుగా కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు ప్రేక్షకులు నుండి మంచి స్పందన లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa