ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదిత్య రాయ్ కపూర్ 'ఓం' టీజర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 02:47 PM

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ 'యే జవానీ హై దీవానీ', 'ఆషికి', 'ఒకే జాను' సినిమాలలో తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. 2020లో విడుదలైన 'మలంగ్' సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం 'ఓం: ది బెటెల్ వితిన్' తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో ఆదిత్య సరసన సంజన సంఘీ జోడిగా నటిస్తుంది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా టీజర్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమా కోసం 'రాంబో' గా మారినట్లు టీజర్ ని బట్టి తెలుస్తుంది. ఈ చిత్రం జూలై 1, 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కపిల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అక్షత్ ఆర్ సలూజా మరియు నికేత్ పాండే కథ మరియు స్క్రీన్ ప్లే రాశారు. జీ స్టూడియోస్, అహ్మద్ ఖాన్ మరియు షైరా ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa