ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ మొదటి నెల వివాహ వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ ఒక స్పెషల్ పార్టీని నిర్వహించింది. ఈ పార్టీకి విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ సహా RCB ప్లేయర్స్ అందరూ హాజరయ్యారు. ఈ పార్టీలో విరాట్ కోహ్లీ 'ఊ అంటావా' పాటకు డాన్స్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa