ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF: చాప్టర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శాండల్‌వుడ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'KGF -2' సినిమాని మాస్ట్రో ఇళయరాజా అండ్ యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ చూసినట్లు తాజా సమాచారం. ఈ ఇద్దరు లెజెండ్స్ కోసం ఒక స్పెషల్ షోను ప్రదర్శించినట్లు టాక్. ప్రదర్శన తర్వాత, వారు 'KGF-2' మొత్తం టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa