పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం "హరి హర వీరమల్లు', 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ లో షురు అయింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరిలో జాక్విలిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని తీసుకున్నారట. ఆమె త్వరలో హరి హర వీరమల్లు సెట్స్ , లో జాయిన్ కానున్నారట. షాజహాన్ చెలెల్లు అయిన రోషనారా బేగం పాత్రలో నోరా కనిపించబోతుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa