యాక్షన్ హీరోగా .. ఫ్యామిలీ హీరోగా రాజశేఖర్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టాయనే విషయం అర్థమవుతుంది. ఈ సారి ఆయన 'శేఖర్' సినిమాలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే, కొన్ని కీలకమైన కేసులను పరిష్కరించే విషయంలో ముఖ్యమైన పాత్రను ప్లే చేయనున్నారు.
జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. అడివి శేష్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. పదవీ విరమణ చేసిన పోలీస్ ఆఫీసర్ గానే రాజశేఖర్ పాత్రను పరిచయం చేశారు.
హీరో ఓ మర్డర్ మిస్టరీని .. ఓ యాక్సిడెంట్ కేసును తనదైన స్టైల్లో విచారణ జరపడం చూపించారు. జరిగింది యాక్సిడెంట్ కాదని ఆయన తేల్చడం .. ఆయనే యాక్సిడెంట్ కి గురికావడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజశేఖర్ లుక్ బాగుంది. ముస్కాన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa